Header Banner

20 ఏళ్ల సినీ కెరీర్ పై స్టార్ హీరోయిన్ పలు ఆసక్తికర కామెంట్స్! ఆ స్థానంలో కొనసాగడం...

  Sun Apr 06, 2025 11:11        Entertainment

ప్రముఖ నటి తమన్నా భాటియా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంతో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో వివిధ భాషల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ఓదెల 2' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, నటనను కేవలం వృత్తిగా కాకుండా ఇష్టంగా, ఆనందంగా చేశానని ఆమె అన్నారు. నిజ జీవితంలో తాను కళాశాల విద్యను అభ్యసించలేకపోయినప్పటికీ, సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని ఆమె తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఆ భ‌యం వ‌ల్ల‌నే అదుర్స్ 2 చేయ‌డం లేదంటూ ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్! ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు..

 

పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్నేళ్లు కొనసాగుతానని అనుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా తన 21వ పుట్టినరోజున జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ రోజు షూటింగ్ నుండి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నంబర్ 1 నటిగా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందని, అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె అన్నారు. ఆ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆమె అన్నారు. నంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత, ఆ స్థానంలో కొనసాగడం అంత సులువు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అది ఒక బాధ్యతగా భావించి, ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నానని తమన్నా వివరించారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tamannaah #Tollywood #Bollywood #FansShockingNews #Vijayvarma #Lovebreakup #MilkyBeauty